23న నందమూరి ‘ఎంఎల్‌ఎ’ వస్తున్నాడు..

235
Kalyanrams MLA Release Date
- Advertisement -

టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తోన్న చిత్రం ‘ఎంఎల్‌ఎ’. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….

కిరణ్‌ రెడ్డి మాట్లాడుతూ – ”మా బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ అసోసియేషన్‌లో గతేడాది విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పెద్ద సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీపుల్‌ మీడియా అసోసియేషన్‌లో చేసిన సినిమా ‘ఎంఎల్‌ఎ’. 2017లో షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు సహా అన్నీ పూర్తయ్యాయి. సెన్సార్‌ కార్యక్రమాలను రేపు జరుగనున్నాయి. అది పూర్తయితే సినిమాను మార్చి 23న విడుదల చేస్తాం” అన్నారు. మా బ్యానర్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్‌ అవుతుందని భావిస్తున్నాను” అన్నారు.

Kalyanrams MLA Release Date

విశ్వ ప్రసాద్‌ మాట్లాడుతూ – ”ఇంతకు ముందు మా బ్యానర్‌లో యు.ఎస్‌లో రెండు ఇండిపెండెంట్‌ సినిమాలు చేశాం. ఫీచర్‌ ఫిలిం పరంగా ఇదే మా తొలి సినిమా. మంచి చిత్రంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం” అన్నారు.

వివేక్‌ కూచిబొట్ల మాట్లాడుతూ – ”ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను ఆల్‌రెడీ విడుదల చేశాం. వాటికి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మరో రెండు సాంగ్స్‌ను కూడా త్వరలోనే విడుదల చేస్తాం. అలాగే మార్చి 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అన్నారు.

భరత్‌ చౌదరి మాట్లాడుతూ – ” నేనే రాజు నేనే మంత్రి తర్వాత మా బ్యానర్‌లో చేసిన చిత్రమిది. ఈ సినిమా టీజర్‌, రెండు పాటలకు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. రేపు సెన్సార్‌ కారక్రమాలు పూర్తి అవుతాయి. కల్యాణ్‌రామ్‌ సినిమా పూర్తయ్యే వరకు చాలా మంచి సహకారం అందించారు” అన్నారు.

Kalyanrams MLA Release Date

దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌ మాట్లాడుతూ ”మా ‘ఎంఎల్‌ఎ’ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుంది. టైటిల్‌ని చూసి ఇది రాజకీయ సినిమా అనుకోవద్దు. చాలా ఫన్‌తో కూడుకుని ఉంటుంది. ఫస్టాఫ్‌ కార్పొరేట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సెకండాఫ్‌ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, హీరో కల్యాణ్‌రామ్‌కి థాంక్స్‌. సినిమాను మార్చి 23న విడుదల చేస్తున్నాం” అన్నారు.

రవి కిష‌న్‌, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రం లో ప్రధాన తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ, సంగీతం: మని శర్మ , సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్‌: తమ్మిరాజు , సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల , నిర్మాతలు : C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.

 

- Advertisement -