గవర్నర్ స్పీచ్..అక్షర సత్యం

214
kcr
- Advertisement -

గవర్నర్ నరసింహన్ స్పీచ్ అక్షర సత్యమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. గవర్నర్ స్పీచ్‌పై ధన్యవాదలు తెలిపే చర్చసందర్భంగా మాట్లాడిన సీఎం చర్చలో పాల్గొన్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు వందశాతం గవర్నర్ స్పీచ్లో ప్రతిభింబించాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి అప్పు ఇచ్చేది ఉందో ఆర్బీఐ దగ్గర ఉంటుందన్నారు. కిషన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు. ఆయన చెప్పిన లెక్కలు అజ్ఞానానికి నిదర్శనమన్నారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ 72 వేల కోట్లు అని తెలిపిన సీఎం…ప్రస్తుతం రాష్ట్రం అప్పు లక్షా 42 వేల కోట్లు అని తెలిపారు.

రూ.2లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం సాధ్యం కాదన్నారు. సమైక్య రాష్ట్రంలో అష్టకష్టాలు పడ్డ తెలంగాణ నేడు ప్రగతి వైపు
దూసుకు పోతుందన్నారు. ప్రభుత్వం అవినీతి రహితంగా,బాధ్యతాయుతమైన పాలనలో ముందుకు పోతున్నామన్నారు.

ఈ నాలుగేళ్లలో 375 శాతం వృద్ధి సాధించామన్నారు. మేం కూడా ప్రజల్లోనే ఉన్నామని ఏం జరుగుతుందో తమకు తెలుసన్నారు. ప్రతిపక్షాల మైండ్ సెట్ మారాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా అప్పులు చేయడానికి ఖర్చులు చేయడానికి అధికారం లేదన్నారు.

- Advertisement -