ప్రియుడి సక్సెస్ కోసం అమితంగా ఆరాటపడే ప్రేయసి ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి. ఈ విషయంలో కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అదృష్టం చేసుకున్నాడనే చెప్పాలి. ఈ యంగ్ డైరెక్టర్ తో నయనతార పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుంది. ప్రియురాలిగా విఘ్నేష్ ను అమితంగా ఆరాధిస్తునే.. అతడి సక్సెస్ కోసం గుళ్ల చుట్టూ తిరుగుతోందట ఈ భామ. తనను దూరం చేసుకున్న మాజీ లవ్వర్లకి ఇలా తన ప్రేమేంటో చెప్పకనే చెబుతోంది నయన్. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా… తన కొత్త ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో
గడపడానికి చాలా సమయం కేటాయిస్తోంది.
‘నానుమ్ రౌడీదాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ యంగ్ డైరెక్టర్‌తో నయన్ ప్రేమ మొదలైంది. ఏదైనా అనుకోని ఘటన జరగితే తప్పా.. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో నటించేందుకు హీరో సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పనిలో పనిగా తన ప్రియురాలిని హీరోయిన్ గా అనుకున్నా.. సూర్య వద్దని చెప్పడంతో విఘ్నేష్ తగ్గాడు. అయితే నయనతారను ఈ సినిమాలో నటింపజేయడానికి విఘ్నేష్ ఇప్పటికి ట్రై చేస్తున్నాడట. ఇదిలా ఉంటే తన ప్రియుడి సినిమా సక్సెస్ కావాలని కోరుతూ రీసెంట్ గా నయనతార ప్రత్యేక పూజలు చేసింది. ప్రియుడు విఘ్నేష్ కూడా నయన్ వెంట ఉన్నాడు. ఇద్దరు కలిసి కుంభకోణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొత్తానికి ప్రియుడి సక్సెస్ కోసం అతడి కంటే ఎక్కువగా నయనతారే ఆరాటపడుతోంది. ఈ విషయం తెలిసినవారంతా ఇలాంటి ప్రేయసి తమకూ ఉంటే ఎంత బాగుండని అనుకుంటున్నారట.
https://youtu.be/uJcp9h07pNY