- Advertisement -
కాంగ్రెస్ సభ్యుల దాడిలో గాయపడిన మండలిఛైర్మన్ స్వామిగౌడ్కు సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మండలిఛైర్మన్ ఆరోగ్య పరిస్థితిపై సరోజినిదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ వివరాలను వెల్లడించారు.
స్వామీగౌడ్ కు మరోసారి కంటి పరీక్షలు నిర్వహించాలని సూపరింటెండెంట్ తెలిపారు. స్వామీగౌడ్ కంటిలో 50శాతం కార్నియా దెబ్బతిన్నదని వెల్లడించారు.
స్వామీగౌడ్ మెల్ల మెల్లగా కోలుకుంటున్నారని చెప్పిన ఆయన రేపు ఉదయం 10 గంటలకు మరోసారి పరీక్షలు నిర్వహించి..తదుపరి చికిత్పపై వివరణ ఇస్తామన్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్.
..
- Advertisement -