నన్ను చాలా మంది వాడుకున్నారు..

180
Lovely Ileana D'Cruz
- Advertisement -

ఇప్పటివరకు నడుము సుందరిగా పేరు గాంచి.. ఎందరో రసికుల హృదయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఇలియానా.. నడుము అంటే ఇలియానా.. ఇలియానా అంటే నడుము అనే నానుడికి నిర్వచనం ఇల్లీ బేబి.  తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకున్న అమ్మడు దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది. తర్వాత సౌత్ సినిమాల్లో నటించడం మానేసి బాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ సన్ననడుము బ్యూటీ తాజాగా సౌత్ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేస్తోంది.

Lovely Ileana D'Cruz

తెలుగు, తమిళ భాషల్లో తనను గ్లామర్ పాత్రల కోసమే తీసుకునేవారని, నటిగా ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదని విమర్శించింది. ఆ కారణం చేతనే దక్షిణాదికి గుడ్‌బై చెప్పి హిందీ పరిశ్రమలోకి వచ్చానని చెప్పింది. బాలీవుడ్‌లో తన సామర్థ్యానికి తగిన పాత్రలు లభించాయని, నటిగా తానేమిటో ప్రేక్షకులు తెలుసుకున్నారని పేర్కొంది. దక్షిణాదిలో ప్రవేశించేనాటికి నా వయస్సు 20ఏళ్లేనని, ఆ సమయంలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించానని, ఆ సమయంలో ప్రతి ఒక్కరు నన్ను గ్లామర్ కోణంలోనే చూసేవారని చెప్పుకొచ్చింది ఈ గోవా బ్యూటీ.

Lovely Ileana D'Cruz

మొత్తానికి ఇలియానా తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అటు తమిళ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమపైనే విమర్శలు గుప్పించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -