శ్రీదేవి-భూదేవి సమేత శ్రీనివాసుడు..

202
- Advertisement -

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవరోజు సాయంత్రం శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై బంగారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం జరిగే ఊంజలసేవను ఆరొవరోజు సాయంత్రం నిర్వహించారు. అందుకు బదులుగా స్వామివారికి వసంతోత్సవం తరువాత జరిగే స్వర్ణరథోత్సవాన్ని సువర్ణరథరంగ డోలోత్సవమని పిలుస్తారు.

బంగారు రథానికి కళ్యాణకట్ట మిరాశీదారులు సమర్పించే బంగారు గోడుగును రథంపై అలంకరిస్తారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారిని బంగారు రథంపై కొలువుదీర్చి సాయంసంధ్య సమయంలో అరుణకీరణ కాంతులు రధంపై పడుతుండగా స్వామివారిని చూసేందుకు వెయ్యి కళ్లైన సరిపోవు. శైబ్య , సుగ్రీవ, మేఘపుష్ప , వలాహాకా అనే నాలుగు గుర్రలను పూన్చిన స్వర్ణరథంపై స్వామివారు విహరిస్తారు. దారుకుడు రథసారథిగా స్వర్ణరథం ముందుగా సాగుతుంది. శ్రీవారి వాహనసేవలలో స్వర్ణరథం ఒకప్రత్యేకమైన విశేషాన్ని కలిగివుంది. ప్రతిమనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే స్త్రీ మూర్తులు మాత్రమే ఈ రథరంగడోలోత్సవాన్ని ముందుకు నడిపిస్తారు. స్వామివారి అన్ని సేవలను నిర్వహించడంలో పురుషులదే పైచేయి అయినప్పటికి తన భక్తుర్రాండ్లైనా మహిళలకు కూడా సముచిత స్థానం ఉందని చెప్పడమే స్వర్ణరథ ప్రత్యేకత.

ttd

దినేష్  రెడ్డి – తిరుమల రిపోర్టర్

- Advertisement -