నిస్వార్ధ సేవ‌కు నిజ‌మైన గుర్తింపు..

876
Sincerity and loyalty rewarded
- Advertisement -

తెలంగాణలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయనే వార్తలు రావడంతోనే టీఆర్ఎస్ లో రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ఎవరికి అవకాశం కల్పిస్తారనే అంశంపై జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. అందరూ అనుకుంటున్నట్టుగానే టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ స్థానానికి పార్టీ ప్రధానకార్యదర్శి, టీ న్యూస్ ఎండీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో పాటు, బడుగుల లింగయ్య యాదవ్(నల్లగొండ), బండ ప్రకాష్ ముదిరాజ్(వరంగల్) ల పేర్లను సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు.

Sincerity and loyalty rewarded

తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి సీఎం కేసీఆర్‌కు జోగినపల్లి సంతోష్ కుమార్ సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సంతోష్ కుమార్ కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం సంతోష్ కుమార్.. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సంతోష్‌ కుమార్‌ పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ వెంటే ఉంటున్నారు. సంతోష్‌ కుమార్‌ అందరికి చిరపచితుడే. ఆయన వ్యవహారమంతా తెరవెనకే ఉంటుంది. అధినేత కేసీఆర్‌ ప్రతి అడుగులోనూ ఆయన ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం కేసీఆర్‌ నీడ సంతోష్ కుమార్‌. ఉద్యమ కాలంలోనే కాదు.. ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగేళ్లలో సంతోష్‌ కుమార్‌ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. సంతోష్‌ కుమార్‌ మిత భాషి, మాటలు తక్కువ, చేతలు ఎక్కువన్నట్టుగా ఒక్క స్మైల్‌ తోనే అన్ని సెట్ చేస్తారన్నపేరుంది. ఇంతకాలం కేసీఆర్‌కు నమ్మిన బంటుగా విధేయుడిగా, తన పూర్తి సమయాన్ని కేటాయించారు సంతోష్ కుమార్‌. ఉద్యమంలో పైకి కనిపించని భాగస్వామ్యాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంతోష్ కుమార్‌ ఎటువంటి అధికారిక పదవిలో కొనసాగలేదు. కేవలం తెరవెనుక ఉండి మాత్రమే పనులను పూర్తి చేశారు. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా సంతోష్ కుమార్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sincerity and loyalty rewarded

ఇక మరో అభ్యర్థి బడుగుల లింగయ్యయాదవ్ స్వస్థలం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామం. 1982లో టీడీపీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన లింగయ్య యాదవ్ 1985-87లో కేతేపల్లి మండల తెలుగు యువత అధ్యక్షునిగా, 1987-97మధ్యలో కేతేపల్లి మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. 1995లో భీమారాం నుంచి ఎంపీటీసీ సభ్యునిగా గెలిచారు, 1998-2012 సంవత్సరాల మధ్యలో టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సుధీర్ఘ కాలం పనిచేశారు. 2009లో మహాకూటమి తరుపున స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి 26ఓట్లతో నేతి విద్యాసాగర్ చేతిలో ఓడిపోయారు. 2012-2015 మార్చి వరకు టీడీపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ పార్టీకి రాజీనామా చేశారు.

Sincerity and loyalty rewarded

2015 మార్చి 16వ తేదీన సీఎం కేసిఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరారు లింగయ్య యాదవ్. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో లింగయ్య యాదవ్ కు అవకాశం దక్కింది. సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన లింగయ్య యాదవ్ అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యసభ అభ్యర్థిగా ఎదిగారు.

Sincerity and loyalty rewarded

మూడో అభ్యర్థి బండ ప్రకాష్ ముదిరాజ్ ది స్వస్థలం వరంగల్ జిల్లా. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ప్రకాష్ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ సంఘానికి అధ్య…నిగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. గతంలో కూడా ప్రకాష్ ముదిరాజ్ పలు పదవులను అలంకరించారు. వరంగల్ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా విధులు నిర్వర్తించారు. కాకతీయ పట్టణాభివ…ద్ధి సంస్థ సభ్యులుగా కూడా ఉన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల్లో బండ ప్రకాష్ ముదిరాజ్ కు అవకాశం లభించింది. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రకాష్ ముదిరాజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యసభ అభ్యర్థి వరకు ఎదిగారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు రేపు తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

- Advertisement -