16 నుంచి సినిమా షూటింగ్‌లు బంద్‌..

241
TFPC cancels film shootings from March 16th
- Advertisement -

గత కొద్ది రోజులుగా దక్షిణాదిన సినీ నిర్మాతలు సర్వీస్‌ ప్రొవైడర్ల తీరుకి వ్యతిరేకంగా పోరాడతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సినిమా థియేటర్లను బంద్ చేసి నిరసన తెలపగా, ఇప్పుడు షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాక కొత్త సినిమాల విడుదలను కూడా నిలిపేయనున్నట్లు స్పష్టం చేశారు. డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు ఛార్జీలను కాస్త తగ్గించడంతో శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సినిమాలు యథావిధిగా ప్రదర్శిస్తున్నారు. మరోపక్క కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం బంద్‌ కొనసాగుతోంది.

TFPC cancels film shootings from March 16th

ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌(టీఎఫ్‌పీసీ) రంగం సిద్ధం చేసింది. ఈ ఆందోళనను ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తామని తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) తెలిపింది. కొన్ని డిమాండ్లతో టీఎఫ్‌పీసీ ఈ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు.

క్యూబ్‌, యూఎఫ్‌వోలు ఇక నుంచి వర్చువల్‌ ప్రింట్‌ ఫీజును వసూలు చేయకూడదు. టికెట్‌ ధరలను నియంతించాలని అంతేకాక ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఛార్జీలను తగ్గించాలి. అన్ని థియేటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్‌ చేయాలి. ఇంకా చిన్న సినిమాల ప్రదర్శనకు తగిన థియేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రొడక్షన్‌ వ్యయాన్ని మరింత నియంత్రించాలని టీఎఫ్‌పీసీ తమ డిమాండ్లను ప్రకటించింది.

- Advertisement -