ప్రత్యేక హోదా రావాలంటే..గజ్జర్ల, తెలంగాణ ఉద్యమం తరహాలోనే ప్రత్యేక హోదా ఉద్యమం కూడా జరగాలన్నారు జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందుకోసం జేఏసీ ఏర్పాటు కావాల్సి ఉందని తెలిపారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా నేతలంతా ఇందుకోసం కలిసి రావాలని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీలు ఉద్యమం చేస్తున్నాయని, టీడీపీ, వైసీపీ నేతలు కేసులకు భయపడుతున్నారన్నారు. తనపై కూడా ఐటీ దాడులు చేయించారని, బాధ్యతగా ప్రవర్తించాల్సిందిపోయి చిల్లరగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు పవన్. కేంద్రంతో గొడవలు పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనుకోవాలని, 2019 ఎన్నికల్లో తన స్టాండ్ ఏంటో చెబుతానని, 2014లో తనని వాడుకుని వదిలేశారనే అభిప్రాయాన్ని తీవ్ర ఆవేదనతో చెప్పారు పవన్ కల్యాణ్ .
అంతేకాకుండా కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతోనే అభివృద్ధి జరగలేదని ఏపీ ఆరోపిస్తోందని.. ఇచ్చినవాటికి లెక్కలు చెప్పనందుకే నిధులు నిలిపామని కేంద్రం అంటోందని.. వీటిలో నిజాలేంటో తేల్చాల్సి ఉందని పవన్ చెప్పారు. ఇక థర్డ్‌ఫ్రంట్ అధికారం కోసం కాదని, స్వతంత్రంగా వ్యవహరించడానికి అని పవన్ కల్యాణ్ అన్నారు. దక్షిణాది నుంచే కాకుండా జిగ్నేష్ లాంటి వాళ్లు కూడా ఈ థర్డ్‌ఫ్రంట్‌లో కలిసొస్తారని పవన్ చెప్పారు.