భారత్‌కు షాకిచ్చిన లంక

250
- Advertisement -

ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. వరుస విజయాలతో మంచి జోష్‌మీదున్న భారత్‌కు గట్టిషాకిచ్చింది. 15 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించింది. లంక విజయంలో కుశాల్ పెరీరా కీలక పాత్ర పోషించాడు. 37 బంతుల్లో 66 ( 6×4, 4×6) పరుగులు చేసి లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ (11) తక్కువ స్కోరుకే ఔటైనా మరోవైపు కుశాల్ మాత్రం విరుచుకపడ్డాడు. భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మంచి రన్‌రేట్‌తో జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. ముఖ్యంగా శార్దుల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. అతడు వేసిన ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదేశాడు. కుశాల్‌కు తోడుగా గుణతిలక (19), చండిమాల్‌ (14),తరంగ (17) రాణించడంతో లంక గెలుపుకు మార్గం సుగుమమైంది.

Srilanka beats India

అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఎదరుదెబ్బ తగిలింది. రోహిత్ డకౌటైనా శిఖర్ ధావన్‌ విశ్వరూపం చూపించాడు. ధావన్‌ (90; 49 బంతుల్లో 6×4, 6×6) చెలరేగాడు.ధావన్‌ దూకుడు కొనసాగిస్తూ.. మనీష్‌ పాండే (37; 35 బంతుల్లో 3×4, 1×6) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరంభంలో కాస్త తడబడ్డా.. క్రమంగా చెలరేగిపోయాడు. చక్కటి బౌండరీలతో అలరించాడు. దీంతో భారత్‌ నిర్ణిత ఓవర్లలో 174 పరుగులు చేసింది.

- Advertisement -