తారక్‌ కొత్త లుక్‌..అదుర్స్

235
NTR’s New Look
- Advertisement -

జై లవకుశ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ నెలలో మూవీ సెట్స్ మీదకు వెళ్లనుండగా సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. సినిమా టైటిల్ దగ్గరి నుంచి,తారక్‌ని త్రివిక్రమ్‌ ఏవిధంగా చూపించబోతున్నాడనే దానిపై టీ టౌన్‌లో రోజుకోవార్త చక్కర్లు కొడుతోంది.

ఇక ఇప్పటిదాకా తెలుగుదనం ఉట్టిపడే టైటిల్స్ తో వచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం ఇంగ్లిష్ టైటిల్ తో రాబోతున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ తో సినిమాకు ‘ఆన్ సైలెంట్ మోడ్’ అనే టైటిల్ పెట్టినట్టుగా పుకారు షికారు చేస్తోంది.

ఇక తివిక్రమ్ మూవీ కోసం ఎన్టీఆర్ తెగకష్టపడుతున్నాడు.. కొత్త లుక్‌తో పాటూ గతంలో కంటే ఫిట్‌గా తయారవుతున్నాడు. జిమ్‌లో తారక్ వర్కౌట్స్‌ను ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మేము ఇంకా పూర్త చేయలేదంటూ చిన్న ట్యాగ్ లైన్ పెట్టాడు. ఇప్పుడు తారక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ను చూసి ఫ్యాన్స్ అదుర్స్ అంటున్నారు. కొత్త లుక్‌లో చాలా బావున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -