అతితక్కువ ధరకే షుగర్‌ మందు..

243
- Advertisement -

దేశంలో 7.2 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. పరీక్షలంటే సామాన్యులు భయపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. మెదక్ జిల్లాలోని ముప్పిరెడ్డిపల్లిలో డయాబెటోమిక్స్‌ మెడికల్ కంపెనీ ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన కేటీఆర్ … ముందుగా గుర్తిస్తే ఏ వ్యాధినైనా తగ్గించుకోవచ్చు అని చెప్పారు.

ఉమ్మిని పరీక్షించి షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునే పరికరాన్ని శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి తీసుకొచ్చారని వెల్లడించారు. వరప్రసాద్‌రెడ్డి అతి తక్కువ ధరకే మందులు అందిస్తున్నారని చెప్పారు. డయాబెటిస్ వల్ల కిడ్నీ రోగులు పెరుగుతున్నారని పేర్కొన్నారు. అందుకే వైద్య పరీక్షలకు భయపడకుండా.. ముందే పరీక్షలు చేయించుకుంటే ఏ వ్యాధినైనా కంట్రోల్ చేయవచ్చని సూచించారు.

ktr

సుల్తాన్‌పూర్‌లో అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 80 వేల కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామన్నారు. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని స్పష్టం చేశారు. ప్రయివేట్ నర్సింగ్ హోంలు మూతపడుతున్నాయన్నారు. 70 శాతం వైద్య పరికరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేశారు.

- Advertisement -