కావాలని అనలేదు.. బీజేపీది అనవసర రాద్ధాంతం

161
MP-kavitha
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోదీని అవమానించాలనే ఉద్దేశం టీఆర్‌ఎస్‌ నేతలకు లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో కావాలని మోదీని అలా అనలేదని.. మాటల ఫ్లోలో అలా వచ్చిందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఎంపీ కవిత మాట్లాడారు. చిన్న పొరపాటును బీజేపీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

kavitha

ప్రధాని నరేంద్ర మోదీ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రైతులు, పేదల ఆదాయం పెంచుతారని అనుకున్నామని, కానీ అందుకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కవిత అభిప్రాయపడ్డారు. ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తమ గళం వినిపిస్తామన్నారు.రైతుల పట్ల ఆవేదనతోనే సీఎం కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారని తెలిపారు. దీన్ని బీజేపీ నేతలు ఇంత రాద్ధాంతం చేయడం అనవసరమని, వారి రాజకీయ దిగజారుడుతనానికి ఇది నిదర్శనం అన్నారు. విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు చేయాలన్నారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో 2014 నుంచే తాము మద్ధతిస్తున్నట్లు ఎంపీ కవిత గుర్తుచేశారు.

ఇప్పటికే ‘నాన్నగారు అలా మాట్లాడతారని అనుకోను. ‘స్లిప్‌ ఆఫ్‌ ద టంగ్‌ (పొరపాటున) అయి ఉంటుందంటూ’ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఇదివరకే ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే.

- Advertisement -