కొన్ని ఉద్యోగాలు అలాంటివి. ఇందులో దేశాన్ని శత్రుసైన్యం నుంచి రక్షించడానికి సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు ముందు వరుసలో ఉంటారు. కన్నవాళ్లని, కట్టుకున్న భార్యని, కన్నబిడ్డల్ని వదిలి దేశం కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. రేయింబవళ్లు కాపలా కాస్తుంటారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎన్నో వార్తలు వినాల్సి వస్తుంది. అయినా కూడా డ్యూటీకే ప్రాధాన్యతనిస్తారు. అయిన వారు అర్థాంతరంగా తనువు చాలించారని వార్తలు విన్నా మనసుని రాయి చేసుకుని డ్యూటీ చేస్తారు.
ఉత్తర ప్రదేశ్ బడగావ్ జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ హెడ్ కానిస్టేబుల్ భూపేంద్ర తోమర్ డ్యూటీలో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 9 గంటలకు అతని రెండు ఫోన్లు వచ్చాయి. ఒకటి కూతురు చనిపోయిందని.. మరో కాల్ హత్యాయత్నం జరిగిందని, మీరు తొందరగా రండి అని.. సాధారణంగా ఏ వ్యక్తైనా తన సొంత కూతురు చనిపోయిందని తెలియగానే అన్ని పనులు వదులుకుని వెళ్లిపోతాడు.. కానీ భూపేంద్రసింగ్ అలా చేయలేదు. గుండెని దిటవు చేసుకుని విధి నిర్వహణకే ప్రాధాన్యత ఇచ్చాడు. కూతురు ఎలాగూ చనిపోయింది. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వ్యక్తినైనా రక్షిద్దామని రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాడు. అతడికి సమయానికి చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
కన్నబిడ్డ మరణ వార్త విన్న వార్తను దిగమింగుకుంటూనే.. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ప్రాణాలతో కాపాడిన భూపేంద్రపై యూపీ పోలీసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతడిని ఆ రాష్ట్ర డీజీపీ శాలువాతో సత్కరించారు.