రిలయన్స్ బిగ్ టీవీ సూపర్ ఆఫర్…

237
- Advertisement -

రిలయన్స్ బిగ్ టీవీ బ్రహ్మాండమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. హెచ్‌వీఈసీ సెట్‌టాప్ బాక్స్ కొన్నవారికి సంవత్సరం పాటు హెచ్‌డీ చానల్స్‌ను పూర్తి ఉచితంగా అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు, ఐదేళ్ల పాటు ఫ్రీ టూ ఎయిర్ చానల్స్‌ను ఉచితంగా వీక్షించే సదుపాయాన్ని కూడా కల్పించింది. మార్చి 1 నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌ లో కస్టమర్లు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని రిలయన్స్ సంస్థ వెల్లడించింది.

Reliance Big TV offers free HD channels for 1 year, 500 free-to-air ...

రూ.499 చెల్లించి బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, షెడ్యూల్ రికార్డింగ్, యూఎస్‌బీ పోర్ట్స్, యూట్యూబ్ యాక్సెస్‌తో పాటు టీవీ షోస్ రికార్డ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని రిలయన్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 499 రూపాయలతో ప్రీ బుకింగ్ చేసుకుంటే బుకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత 1,500 చెల్లించి సెట్‌టాప్ బాక్స్‌ను, సంబంధిత ఔట్‌డోర్ యూనిట్‌ను పొందొచ్చని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. ఇన్‌స్టాలేషన్ చార్జీలు రూ.250 అదనం. అయితే సంవత్సరం తర్వాత నెలకు 300 చెల్లించాల్సిందేగా అని డీలా పడాల్సిన అవసరం లేదని సంస్థ చెబుతోంది.

ఆ తర్వాత సంవత్సరం నుంచి నెలకు 3వందలు చెల్లిస్తే.. రెండేళ్లు పూర్తయిన తర్వాత బుకింగ్ కోసం చెల్లించిన 2వేలను రిఫండ్‌గా తిరిగిస్తామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది.

- Advertisement -