శ్రీదేవి ఓకే.. మరి సన్నీ చస్తే..?

460
- Advertisement -

శ్రీదేవి చనిపోతే సరే…మరి సన్నీలియోన్‌ చనిపోతే ఏం చేస్తారు..? ఈ ప్రశ్న వేసింది ఎవరో కాదు నటి కస్తూరి శంకర్‌. కస్తూరి ఇలా మాట్లాడడానికీ కారణముంది. శ్రీదేవి హఠాన్మరణం చెందిన నాటి నుంచి అంత్యక్రియల వరకు ప్రాంతీయ, జాతీయ మీడియాల్లో ఏ చానెల్ చూసినా శ్రీదేవి గురించే చూపించారు. అంతేకాదు ఆమె గతంలో నటించిన సినిమాల్లోని పాటలవేసి ప్రసారం చేసిన విషయం తెలిసిందే.

 Actress Kasturi Shankar Sensational Tweet On Late Sridevi And sunny leone

ఈ నేపథ్యంలోనే మీడియా తీరుని ఎండగడుతోంది కస్తూరి. ”బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి చస్తే ప్రచారం కోసం మీడియా టీవీ చానల్స్ లో ఆమె సినిమా పాటలు వేసి టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ప్రయత్నించింది.. సరే మరి అదే సన్నీ లియోన్ మరణిస్తే ఏం చేస్తారు..?’ అని ట్వీట్‌ ద్వారా మీడియాను సూటిగా ప్రశ్నించింది.

ఐదు బాషల్లో దాదాపు 245 సినిమాల్లో నటించిన ప్రముఖ నటి శ్రీదేవి మరణిస్తే విచారం వ్యక్తం చెయ్యకుండా ఆమె గ్లామర్ రోల్స్ నటించిన రోమాంటిక్ సినిమా పాటలు వేస్తూ ఆమె అభిమానులను కించపరిచారని ఆమె చెప్పుకొచ్చింది.

 Actress Kasturi Shankar Sensational Tweet On Late Sridevi And sunny leone

ఇక కస్తూరి ట్వీట్‌కి నెటిజన్లు రియాక్ట్‌ అవుతున్నారు. ఈమెపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ట్వీట్లు చేయడం చేస్తున్నారు. సన్నీ సంగతి సరే మొదట మీ సంగతి చూసుకోండి అంటూ కొందరు హితవు పలికితే.. ఇంకొందరైతే కస్తూరి సినిమాలకు సంబంధించిన వీడియో, ఫొటో క్లిప్పింగ్స్‌ను అటాచ్ చేస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అయిననప్పటికీ కస్తూరి మాత్రం ఏం తగ్గలేదు. నెటిజన్లు చేసే ట్వీట్‌ కి రిప్లే కూడా ఇస్తోంది కస్తూరి. అంతేకాదు ఎవరైనా ఇదేంటి ఇలా చేస్తున్నావ్.. పద్ధతి కాదుకదా అంటే.. అవునా.. నేను కాపీ పేస్ట్ చేశాను అంతే అంటూ రిప్లై ఇచ్చింది. ఇలా ప్రతీ నెటిజన్‌కూ ఆమె రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే.. నటి కస్తూరి గతంలో పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -