మొబైల్‌ గవర్నెన్స్‌లో తెలంగాణ భేష్

210
KTR launches T App Folio
- Advertisement -

మొబైల్ గవర్నెన్స్ లో దేశంలో రెండో రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఐటీసీ కాకతీయ హోటల్‌లో టీ యాప్ ఫోలియోను ఆవిష్కరించిన కేటీఆర్ 4500 మీ సేవ ప్రాంఛైజీల వ్యాపారం దెబ్బతినకుండా టీయాప్ ఫోలియోలో సర్వీసులను ఏర్పాటుచేస్తున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో ల్యాండ్ రికార్డ్ అప్డేట్స్ జరిగాయని ఇందులో టెక్నాలజీ విసృతంగా ఉపయోగించామన్నారు.

టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా సామాన్యులకు ఉపయోగపడకపోతే లాభముండదని సీఎం కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. భూరికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 86 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామని మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూరికార్డుల ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. ఈ-సేవ, మీ-సేవలతో రికార్డు స్థాయిలో ట్రాన్సెక్షన్స్ జరుగుతున్నాయని, వీటిలో ఐటీ పాత్ర కీలకమని తెలిపారు మంత్రి కేటీఆర్.

ktr

త్వరలోనే సిటీలోనూ ల్యాండ్ రికార్డుల అప్డేట్ ఉంటుందన్నారు. అప్పట్లో ఫోన్ లో మాట్లాడాలంటే పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తులకే ల్యాండులైన్ ఉండేదని, ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని మొబైల్ రంగం దూసుకుపోతుందన్నారు. ఫోన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో కమ్యునికేషన్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. స్మార్ట్ ఫోన్స్ రూపంలో ఐటీని మరింత విస్తృతం అవుతుందన్నారు. పేదవారు.. ధనిక అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లు ఉండటం అద్భుతన్నారు. టీయాప్ ఫోలియో అనే యాప్ సాధారణమైనది కాదని, ఐదు వందల సేవలు ఇందులో ఉంటాయన్నారు. సమాచార విఫ్లవం అరచేతిలోనే చేసుకునే విధంగా టీయాప్ ఫోలియో రానుందన్నారు.

ఐటీతో ఊహించినదానికంటే ఎక్కువ మార్పులు వస్తున్నాయన్న కేటీఆర్.. పోలీసింగ్, అగ్రకల్చర్ లాంటి అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వ్యాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాను ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే ఎక్కువగా ఉపయోగించడం అభినందించతగ్గ విషయమన్నారు. ఐటీ కొత్త పుంతలె తొక్కడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్, మీసేవ కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు.

 KTR launches  T App Folio

- Advertisement -