కొత్త జిల్లాల సంఖ్య ఇంకా తెలియదు..

240
- Advertisement -

కొత్త జిల్లాల సంఖ్య ఇంకా తెలియదని….ఇంకా కసరత్తు జరుగుతోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కేశవరావు కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించిందని….ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జిల్లాల సంఖ్యపై స్పష్టత వస్తుందని కడియం తెలిపారు. దసరా నాటికి కొత్త జిల్లాలపై స్పష్టత రావొచ్చని అన్నారు. జిల్లాల విభజన జరగనిదే…సివిల్స్ సర్వీసు అధికారుల సంఖ్య గురించి మాట్లాడలేమన్నారు. కేబినెట్ భేటిలో ప్రధానంగా రెసిడెన్షియల్ స్కూళ్లపై చర్చించామని తెలిపారు.

kcr

కేబినెట్ నిర్ణయాలు

() కొత్తగా బీసీ గురుకులాల ఏర్పాటుకు అమోదం

()మైనార్టీ విద్యార్థుల కోసం 90 రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు..

()2017-18 సంవత్సరంలో 117 కొత్త బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభం

()మున్సిపల్ ఉద్యోగుల బదీలిల్లో ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

()వెనుకబడిన తరగతుల కోసం 190 రెసిడెన్షియల్ స్కూళ్లు

()బిల్డింగ్ ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు అమోదం

()30 మహిళ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు అమోదం

()బీసీ కమిషన్ ఏర్పాటుకు అమోదం

()కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం(కరీంనగర్‌,రామగుండం,నిజామాబాద్,సిద్దిపేట)

()ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాలు..కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆర్డినెన్స్

()కొత్త జిల్లాలో పోస్టుల భర్తీకి నిర్ణయం

()కేన్స‌ర్ ఆసుప‌త్రి కోసం శేరిలింగం ప‌ల్లిలో హెటిరో సంస్థ‌కు 15 ఎక‌రాల భూమి కేటాయింపు..

- Advertisement -