శ్రీదేవి కేసు క్లోజ్..బోనీకి క్లీన్ చీట్

347
- Advertisement -

రెండున్నర రోజుల హైడ్రామాకు తెరపడింది. అందాల నటి శ్రీదేవి మృతి కేసును మూసేశారు దుబాయ్ పోలీసులు. ఎన్నో మలుపుల…అంతకుమించి తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసులో విచారణ మొత్తం పూర్తయినట్లు పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు ఈ ప్రమాదవశాత్తు మృతి కేసును మూసేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ సందర్భంలో బోనీ కపూర్‌ను దుబాయ్ పోలీసులు ప్రశ్నించారని, లేదని రకరకాల వార్తలు వచ్చాయి.. ఆయన్ను మూడు గంటల పాటూ ప్రశ్నించినట్లు వార్తలొచ్చాయి. కాని దీన్ని దుబాయ్ పోలీసులు కొట్టి పారేశారట. అసలు బోనీని ప్రశ్నించలేదని చెప్పారు. శ్రీదేవి ఎలా చనిపోయారన్న విషయంపై మాత్రమే వాంగ్మూలం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Sridevi case closed

సోమవారమే ఫోరెన్సిక్ నివేదిక వచ్చినా.. దాని ప్రకారం దుబాయ్ పోలీసులు ఈ కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. వాళ్లు తదుపరి విచారణను పూర్తిచేశారు. ఆమె మృతి ప్రమాదవశాత్తూ జరిగినట్లు నిర్ధారించుకున్న తర్వాత కేసును మూసేస్తున్నట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించింది.

dubai

శ్రీదేవి పార్థివదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు దుబాయ్‌ పోలీసులు అంగీకరించారు. ఈ మేరకు భారత దౌత్యఅధికారులు, ఆమె కుటుంబ సభ్యులకు అనుమతి పత్రాలను దుబాయ్‌ పోలీసులు అందజేశారు. దుబాయ్‌ పోలీసుల అనుమతి నేపథ్యంలో శ్రీదేవి పార్థివదేహాన్ని రసాయనిక శుద్ధి (ఎంబామింగ్‌) కోసం పంపించనున్నారు. ఈ ప్రకియ తర్వాత తదుపరి ప్రక్రియల్ని పూర్తిచేసి శ్రీదేవి మృతదేహాన్ని భారత్‌కు తరలిస్తారని సమాచారం.ఇవాళ రాత్రికి ముంబయికి చేరుకునే అవకాశం ఉంది.

- Advertisement -