శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్…

206
Sridevi Mother Asked Me To Marry Sridevi
- Advertisement -

అందాల నటి, సీనియర్ హీరోయిన్ శ్రీదేవి గుండెపోటుతో అనంతలోకాలకు వెళ్లిపోయింది. సినీ,రాజకీయ ప్రముఖులు శ్రీదేవి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమెతో కలిసి పనిచేసిన దర్శకులు, సహనటులు శ్రీదేవి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ శ్రీదేవి మరణవార్త విని షాక్ అయ్యారు. ఆమె ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి కుటుంబంతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని రాజశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి కుటుంబానికి రాజశేఖర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Sridevi Mother Asked Me To Marry Sridevi

ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్‌ వచ్చిందని తెలిపారు. మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్‌గా, శ్రీదేవి వాళ్ల నాన్న అడ్వొకేట్‌గా ఒకేచోట పనిచేశారు. వాళ్లకు, మాకు దూరపు బంధుత్వం ఉంది. శ్రీదేవి అమ్మగారికి నేనంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని వాళ్ల ఇంటి నుంచి నాకు ప్రపోజల్ వచ్చింది. అయితే శ్రీదేవి అప్పటికే సినిమాల్లో ఉండడంతో మా అమ్మ వద్దని చెప్పింది. నేను ఎమ్మెస్ చదవాలని చెప్పి ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పారు. అందుకే శ్రీదేవితో పాటు శ్రీలత సంబంధాన్ని కూడా వద్దన్నారు అని రాజశేఖర్ చెప్పారు.

- Advertisement -