మంత్రి కెటి రామరావుకు మరొక గౌరవం దక్కింది. మద్రాస్ మేనేజ్ మెంట్ అసోషియేషన్ ప్రత్యేక అహ్వనం మేరకు ఈ రోజు చెన్నైలో జరిగిన సంస్ధ 2018 వార్షిక సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సు ముగింపు సమావేశానికి హజరయ్యారై లర్నింగ్ టూ గ్రో అనే అంశంపైన మంత్రి ప్రసంగించారు.
తెలంగాణ రాష్ర్టం గత మూడు సంవత్సరాల్లో ఏవిధంగా ఎదిగింది, ప్రభుత్వ పాలసీల్లో ఏలా విజయం సాధించింది అనే అంశాన్ని మంత్రి వివరించారు. వినూత్న విధానాలు, ముందుచూపు ఉన్న నాయకత్వం ద్వారానే తెలంగాణ రాష్ర్టం ముందుకు పోతుందని పెర్కొన్నారు. తెలంగాణను స్టార్ట్ అప్ స్టేట్ గా పెర్కోంటానమని, అదే తీరుగా పనిచేస్తూ రాష్ర్టాన్ని అత్యుత్తమ పరిపాలన ప్రమాణాలు, వినూత్నమైన విధానాలతో ముందుకు తీసుకెళుతున్నామని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల నుంచి ప్రజల ప్రాథమిక అంశాలైన విద్యుత్, తాగునీరు వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చామని, అందుకే విద్యుత్ కొరత రాష్ర్టం నుంచి మిగులు విద్యుత్ రాష్ర్టంగా మారమని, త్వరలోనే ప్రతి ఇంటికి తాగునీరు అందించే రాష్ర్టంగా మారబోతున్నామని మంత్రి తెలిపారు. దీంతోపాటు ఎర్పాటు చేయున్న తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందిస్తామని, దీంతో విద్యా, వైద్యం, గవర్నెస్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ రాష్ర్టం వేదిక కాబోతున్నదన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ రూపొందించే సమయంలో ప్రభుత్వం అత్యుత్తమ విధానాలను అదర్శంగా తీసుకుని, వ్యక్తుల కేంద్రీకృత పాలసీల స్ధానంలో వ్యవస్దీకృత అధారిత టియస్ ఐపాస్ పాలసీ రూపొందించామన్నారు. తమ అలోచనలు ఫలించి ఇప్పటిదాకా సూమారు 6000 కు పైగా అనుమతులు టియస్ ఐపాస్ ద్వారా ఇచ్చామని, ఇందులో సగానికిపైగా కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. ఇలాంటి వినూత్న విధానాలతో ముందుకు పొతున్నందుకే దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ర్టంగా తెలంగాణ ఉన్నదని, ఈజ్ అఫ్ డూంయింగ్ బిజినెస్ లో అగ్రస్ధానంలో ఉందన్నారు.
భారతదేశం రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళుతుందని, ముఖ్యంగా దేశానికి ఉన్న యువ శక్తి దేశాన్ని భవిష్యత్తులోకి నడుపుతుందన్నారు. యువత అశలకు, అకాంక్షలకు ప్రభుత్వాలు ఆసరా అందిస్తే చాలని, ప్రపంచాన్ని జయించే శక్తి ఉందన్నారు. అందుకే యువశక్తి అలోచనలకు ఉతం ఇచ్చేందుకు తాము టిహబ్, టి వర్స్క్ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. మరింత వేగంగా దేశాభివృద్ది జరగాలంటే ప్రభుత్వాలు ప్రయివేటు సంస్ధల్లాగా అలోచించి తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని, ప్రయివేటు సంస్ధలు ప్రభుత్వాల మాదిరి అలోచించి సమాజం కోసం పనిచేయాలన్నారు. దేశాభివృద్ది దిశగా నేర్చుకునే అనుభవాలకు తెలంగాణ సాధించిన విజయాలు స్పూర్తినిస్తాయన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ర్టాలు తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఫథకాల పట్ల ఆసక్తి చూపిస్తున్న విషయాన్ని మంత్రి ఈ సదర్భంగా పెర్కోన్నారు. ఈ సమావేశంలో ప్రసంగించాల్సిందిగా అహ్వనించడం పట్ల మంత్రి యంయంఏ (MMA) దన్యవాదాలు తెలిపారు.