ఆర్జీవీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

268
cyber police to Arrest RGV
- Advertisement -

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చిత్రీకరించిన ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ లఘుచిత్రం పై గత కొన్నిరోజులుగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. మహిళలను కించపరిచే విధంగా వర్మ ఈ లఘు చిత్రాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ మ‌హిళ సంఘాల నుంచి తీవ్ర‌వ్య‌తిరేక‌త మవడంతో పాటు సీసీఎస్ పోలీసులకు సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని గత వారం వర్మకు పోలీసులు నోటీసులందించారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరవుతానని తెలిపిన వర్మ ఇంతవరకు పోలీసుల ఎదుట హాజరుకాలేదు. దీంతో వర్మ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

   cyber police to Arrest RGV

ఓ చర్చా వేదికలో తనను రాంగోపాల్‌ వర్మ అవమానించారంటూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్‌ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్‌ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకపోవడంతో వర్మ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -