సస్పెండ్‌ చేస్తే…17 మందిని చంపేశాడు

185
Florida school shooting: At least 17 dead
- Advertisement -

అమెరికాలో మరో పాశవిక నరమేథం జరిగింది. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో గల మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ స్కూల్‌లో భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మంది మృతి చెందగా 16 మందికి గాయాలయ్యాయి. అదే పాఠశాలలో చదువుతున్న నికోలస్ క్రూజ్ అనే 19 ఏళ్ల విద్యార్ధి కాల్పులకు తెగబడ్డాడు. స్కూల్ నుంచి సస్పెండ్ చేశారన్న కారణంతో ఇంతటి దారుణానికి ఒడగట్టాడు.

 florida-shooting

పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన ప్రాయం.. స్నేహితులతో సరదాగా ఆడిపాడే వయసు.. కానీ కోపంతో పుస్తకాలు వదిలి తుపాకీ పట్టుకున్నాడు. తోటి స్నేహితులనే అతి కిరాతంగా చంపేసి వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాడు. క్రమశిక్షణగా ఉండటం లేదని స్కూల్‌ నుంచి సస్పెండ్‌ చేయడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు.

నికోలస్‌ క్రూజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్ప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల బీభత్సంతో స్కూల్ ప్రాంగణం మొత్తం రక్తమడుగులతో భీకరంగా మారింది. కాల్పుల నుంచి త‌ప్పించుకునేందుకు అక్కడివారు భయంతో న‌లుదిక్కుల‌కూ పరుగులు తీశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

 florida-shooting  florida-shooting

- Advertisement -