మెగా హీరో వరుణ్ తేజ్ ‘ఫిదా’ తర్వాత ‘తొలిప్రేమ’ సినిమాతో మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇంటెలిజెంట్ – గాయత్రి సినిమాల పాటు విడుదలై… ఈ సినిమా ఒక్కటే హిట్ కొట్టింది. ఇందులో లవర్ బాయ్‌గా ఆకట్టుకున్నాడు వరుణ్. ఫిదాలో కూడా సున్నిత మనస్సున్న యువకుడిగా లవర్ బాయ్‌గా నటించి మెప్పించాడు. ఈ రెండు సినిమాల్లో లవర్ బాయ్‌గా నటించిన వరుణ్ తరువాత చేయబోయే సినిమా మాత్రం పూర్తిగా డిఫరెంట్‌గా ఉండబోతుందని సమాచారం.
వరుణ్ తర్వత సినిమా ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ఉండబోతున్న విషయం తెలిసిందే. వరుణ్ కోసం ఓ స్పేస్ కథను సిద్ధం చేశాడు దర్శకుడు సంకల్ప్. ఆ సినిమాలో ఎక్కువ భాగం గురుత్వాకర్షణ శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో (జీరో గ్రావిటీ) జరుగుతుంది. అలా జీరో గ్రావిటీ పరిస్థితుల్లో నటించేందుకు వరుణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట. ఇందుకోసం కజకిస్థాన్ వెళ్లబోతున్నారు వరుణ్ – సంకల్స్ రెడ్డి. వచ్చేనెలలో వెళ్లి అక్కడ నెల రోజుల పాటూ ఉండి జీరో గ్రావిటీలో ఎలా నటించాలో తెలుసుకుని వస్తారట.
మన తెలుగు హీరోలు సాధారణంలో ఇలా ట్రైనింగ్ లేవీ తీసుకోకుండానే నటిస్తారు. ఏ పాత్ర అయినా అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా చేసేస్తారు. కానీ వరుణ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. పద్దతి ప్రకారం చేయడానికి ఇష్టపడుతున్నట్టున్నాడు. వరణ్ ఈ మూవీతో మరో హిట్ కోట్టాలని బాగానే కష్టపడుతున్నాడు. మరి ఈ మూవీ కూడా హిట్టైతే వరుణ్‌కు హ్యట్రిక్ పడ్డటే.