బాహుబలి తర్వాత పద్మావత్..!

204
- Advertisement -

దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధానమైన పాత్రలలో, సెన్సేషనల్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘పద్మావత్’. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకువచ్చిన పద్మావత్‌..హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్లా భారీ వసూళ్లను సాధిస్తూ టాక్ ఆఫ్ ది సినిమాగా నిలుస్తున్న పద్మావత్ తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరింది.

ఆందోళనల మధ్య విడుదలైన బాలీవుడ్ బడా మూవీ ‘పద్మావత్’ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్‌గా పద్మావత్ రూ. 500 కోట్లు కొల్లగొట్టినట్టు ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.  రాణి పద్మినిగా దీపికా, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్, మహారావల్ రతన్ సింగ్‌గా షాహిద్ తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. 1540లో సూఫీ కవి మాలిక్ మొహమ్మద్ జయసీ రాసిన పుస్తకం ఆధారంగా పద్మావత్‌ను తెరకెక్కించారు బన్సాలీ.

Padmaavat-vs-Bahubali-22-battle

ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. బాహుబలి -2 తర్వాత ఆస్ట్రేలియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 3మిలియన్ డాలర్లు క్రాస్ చేసిన సెకండ్ సినిమా పద్మావత్ కావడం విశేషం. పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ ఒకరు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పద్మావత్, బాహుబలి-2 కలెక్షన్స్‌ను వెల్లడించారు.

బాహుబలి-2 – 33లక్షల 50,372 ఆస్ట్రేలియన్ డాలర్స్‌ను రాబట్టగా.. పద్మావత్ 30లక్షల 92,553 డాలర్లను రాబట్టి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. పద్మావత్ సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదంటూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడవన్నీ సమసిపోయి ఇంత భారీ వసూళ్లను రాబట్టడం విశేషం.

- Advertisement -