- Advertisement -
తిరుమల శ్రీవారిని మంత్రి హరీష్ రావు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీవారి దివేనలతో కోటి ఎకరాల మాగాణి కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలని స్వామివారిని మంత్రి వేడుకున్నారు.
అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు దిన దినాభివృద్ది చెందుతున్నాయని, రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన తో ముందుకెళ్ళాలని అన్నారు. సీఎం కేసీఆర్ తిరుమల సమానంగా యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు.
ఉభయ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న మంత్రికి టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాలాజి స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి,స్వామివారి తీర్దప్రసాదాలను,పట్టువస్త్రాలను అందజేశారు.
..
- Advertisement -