మేడారం..మినీ కుంభమేళా అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి కొనియాడారు. మేడారం జాతరపై రాజ్యసభలో ప్రస్తావించిన ఆయన..జాతర బ్రహ్మాండంగా జరిగిందని…. సమ్మక్క – సారలమ్మ జాతర ఔనత్యాన్ని సభ్యులకు వివరించారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి కోటి 50 లక్షల మంది జాతరకు హాజరైనట్లు తెలిపారు. గిరిజనుల జాతర ఎంతో గొప్పగా జరిగిందన్నారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఈ జాతరలో పాల్గొనడం థ్రిల్లింగ్ గా ఫీలయ్యానని చెప్పారు. భక్తులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని వెంకయ్య పేర్కొన్నారు.
మేడారం సమ్మక్క సారక్క జాతరలో భాగంగా ఫిబ్రవరి 2న వెంకయ్య నాయుడు వనదేవతలను దర్శించుకున్న సంగతి తెలిసిందే. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న ఆయన పట్టు వస్ర్తాలను సమర్పించారు. వన దేవతలకు నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించారు. జాతరలు,పండగలు మన పూర్వికులను గుర్తించుకోవడం, మంచి మార్గంలో ముందుకెళ్లేందుకు తోడ్పడతాయన్నారు. సాధారణ పౌరుడిగా కొన్ని సంవత్సరాల కింద మేడారం వచ్చానని…ఇప్పుడు ఉపరాష్ట్రపతి హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు. మేడారం విశ్వవ్యాప్తం కావాలన్నారు.వనదేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు.