స్వీటీకి ఫోన్‌ చేసి రజిని ఏమన్నాడు..?

188
- Advertisement -

టాలీవుడ్‌ స్వీటీ అనుష్క ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాలతో స్టార్ హీరో రేంజ్ అందుకున్న ఈ యోగా బ్యూటీని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

అంతేకాకుండా భాగమతి సినిమాని ఆకాశానికి ఎత్తుతున్నారు. ముఖ్యంగా అనుష్క నటనకి నీరాజనాలు పలుకుతున్నారు. ఇటీవల రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజ్ లో సినిమా చాలా బాగుందని ట్వీట్ చేస్తూ, ‘భాగమతి’ సినిమా చూసిన తర్వాత తన భార్య ఉపాసనకు నిద్రపట్టలేదని అన్నారు.

Anushka gets a call from Rajinikanth...

ఇక తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ అనుష్కకి స్వయంగా ఫోన్ చేసి కంగ్రాట్స్‌ చెప్పారట. ఈ విషయాన్ని అనుష్క ఓ కార్యక్రమంలో తెలిపింది. తన నటన చాలా బాగుందని రజనీకాంత్ చెప్పగానే తాను చాలా సంతోషించానంటూ అనుష్క చెప్పుకొచ్చింది. ఇక నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, నా స్నేహితులు కూడా శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపడం ఎంతో ఆనందం కలిగించిందని అనుష్క పేర్కొంది.

- Advertisement -