ప్రపంచం అబ్బురపడేలా వచ్చే మేడారం జాతరను నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వరంగల్ జిల్లా మేడారంలో వనదేవతలను దర్శించుకున్న అనంతరం మాట్లాడిన సీఎం తెలంగాణ పోరాట పటమికు సమ్మక్క-సారక్క నిదర్శనమన్నారు.
కోటికి పైగా పాల్గొంటున్న ఈ జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమ్మక్క-సారక్క జాతరకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం అన్నిచర్యల చేపడుతుందన్నారు. మేడారంలో మరింత స్ధల సేకరణ జరగాల్సిన అవసరం ఉందని.. 200 వందల ఎకరాలతో మేడారంను అభివృద్ది చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్లో మేడారం కోసం రూ. 200 కోట్లు కేటాయిస్తామన్నారు. 15 రోజుల్లో మరోసారి మేడారంకు వస్తానని తెలిపారు.
జాతరకు మంచి ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు. మేడారంను జాతీయ పండుగగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. వచ్చే జాతర నాటికి ప్రపంచం అబ్బురపడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. సమైక్యపాలనలో మేడారంను నిర్లక్ష్యం చేశారన్నారు.