టీఆర్ఎస్‌ గెలవకుంటే..రాజకీయ సన్యాసం తీసుకుంటా

236
KTR hits back again Uttam Kumar
- Advertisement -

2019 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గులాబీ జెండా ఎగరడం … టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఉత్తమ్ రాజకీయ సన్యాసం చేస్తారా అని సవాల్ విసిరారు కేటీఆర్. గ‌ద్వాల చేనేత పార్క్‌కు శంకుస్ధాప‌న చేసిన అనంత‌రం మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ నాయకుల వైఖరిని ఎండగట్టారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనన్న ఉత్తమ్ గబ్బర్ సింగ్ కాదని ఎద్దేవా చేశారు. అధికారం కోసం గడ్డం పెంచుతామంటే అందరూ గడ్డాలే పెంచుతారని మండిపడ్డారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని దుయ్యబట్టారు. జీహెచ్‌ఎంసీ,పాలేరు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించా…ఉత్తమ్ రాజీనామాకు సిద్దమా అని సవాల్ చేస్తే తొకముడిచారన్నారు. నీళ్లు,కరెంట్ లేని ఊర్లు ఉన్నందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలా అని ఎద్దేవా చేశారు.

ద‌శాబ్దాల పాటు మ‌న‌ల్ని ప‌రిపాలించి వెన‌క్కి నెట్టేశార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. తెలంగాణ వ‌స్తే ఎమోస్త‌ద‌న్న కాంగ్రెస్ నాయ‌కులు సిగ్గుప‌డాల‌న్నారు. తెలంగాణ వ‌స్తే అంధ‌కార‌మోస్త‌ద‌ని కిర‌ణ్ కుమార్ రెడ్డి అన్నార‌ని కానీ నేడు తెలంగాణ విద్యుత్ కోత‌లు లేని రాష్ట్రంగా మారింద‌న్నారు. దేశంలోని ఆడ‌బిడ్డ‌లంద‌రికీ గ‌ద్వాల ప‌ట్టు చీర‌లంటే ప్రాణ‌మ‌న్నారు. ఒకే రోజు రూ.40 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని తెలిపారు.

నిజాం హ‌యాంలోనే పాల‌మూరును స‌స్య‌శ్యామలం చేయ‌డానికి శ్రీ‌కారం చుట్టార‌ని తెలిపారు.కాంగ్రెస్ చేసిన పాపానికి అష్ట‌క‌ష్టాలు ప‌డ్డ జిల్లా పాల‌మూరు జిల్లా అన్నారు. నాడు అడుగ‌డునా ప్రాజెక్టుల‌ను అడ్డుకునేందుకు కుట్ర‌లు ప‌న్నార‌ని తెలిపారు.

ఈ దేశంలో ఎవరు ఉహించని విధంగా అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాల కోసమే రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.కృష్ణమోహన్ రెడ్డి అద్బుతంగా పనిచేస్తున్నారని..పనిచేసే నాయకుడికి పట్టం కట్టాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -