ఓ వైపు స్టార్ హీరో సినిమాల్లో ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ ఇంప్రెస్ చేస్తూనే మరో వైపు హీరోగా డిఫెరెంట్ సినిమాలు చేస్తూ ఎప్పటి కప్పుడు సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు హీరో శ్రీకాంత్. తాజాగా ఇయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ 2019’. ‘బీవేర్ ఆఫ్ పబ్లిక్’ అనేది ఉపశీర్షిక. కరణం బాబ్జీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ సమర్పిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ శుక్రవారం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిని సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ఈసినిమాకు సంబంధించిన టీజర్‌ను శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దీన్ని శ్రీకాంత్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ టీజర్లో శ్రీకాంత్ ఒంటి నిండా గాయాలు కనిపించాయి. రౌడీలు ఆయన్ను తీవ్రంగా గాయపరిచి.. అక్కడి నుంచి వెళ్ళారు. శ్రీకాంత్ గాయాలతో నేలపై కూర్చొని, ఉక్రోషంగా చూస్తూ కనిపించారు. టీజర్లో ఒక డైలాగ్ కూడా లేదు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారట.
వేసవిలో ‘ఆపరేషన్ 2019’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ‘రా రా’ అనే కామెడీ హారర్ తర్వాత శ్రీకాంత్ నటిస్తు్న్న సినిమా ఇది. ఇప్పుడు ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.