అమ్రాపాలి..తెలుగు తడబాటు

203
Warangal collector Amrapali at Republic Day Celebrations
- Advertisement -

అందం.. అనుకువ.. ధైర్యం.. తెగువ.. ఇవన్నీ కలగలిసి ఉన్న యువ కలెక్టర్‌.. అమ్రాపాలి. మోడ్రన్ డ్రెస్ వేసుకుని గుడిలోకి వచ్చినా…ట్రెక్కింగ్ చేస్తూ కొండలెక్కిన ఈ కలెక్టరమ్మకే చెల్లింది. వరంగల్ అర్బన్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడపడంలో తనవంతు పాత్రను పోషిస్తూ అందరి మన్ననలు పొందుతున్న అమ్రాపాలి మరోసారి వార్తల్లో నిలిచారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రగతి గణాంకాలను వివరిస్తూ అమ్రపాలి చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జెండా వందనం అనంతరం ఆమె తన ప్రసంగం మధ్యలో అదే పనిగా అకారణంగా, అసందర్భంగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడడం, అంతేకాకుండా ‘ఇట్స్‌ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగులో రాసిన ప్రసంగాన్ని చదువుతూ పలుమార్లు తడబడ్డారు.

మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రగతి గురించి ప్రస్తావన వచ్చినపుడు ఏకంగా వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తనలో తాను ‘ఇట్స్‌ ఫన్నీ’ అంటూ వ్యాఖ్యానించారు. ఈతతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన భారీ మైకుల ద్వారా అందరికీ వినిపించింది. అంతేకాదు ఆమ్రపాలి తడబడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -