భారత టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో రిపబ్లిక్ డే సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. సరికొత్త వివోఎల్టీఈ టెక్నాలజీ, అపరిమిత సేవలతో వినియోగదారుల మనసు గెలుచుకున్న ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్లలోనే మార్పులు చేయడమే కాక, కొన్ని కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది.
రూ.49కే 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌తో పాటు అపరిమిత డేటాను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ఈ రోజు (జనవరి 26) నుంచే అమలు కానుంది. ఈ ప్లాన్ ద్వారా ఒక జీబీ వరకు హైస్పీడ్ డేటాను పొందవచ్చు. దీనితోపాటు రూ.11, రూ.21, రూ.51, రూ.101 డేటా యాడ్ ఆన్స్‌ను కూడా జీయో అందుబాటులోకి తెచ్చింది.
ఈ ప్లాన్‌తో జీయో ఫోన్ల కొనుగోళ్లను మరింత పెంచుకోవాలని జియో భావిస్తోంది. ఇప్పటి వరకు రోజుకి 1జీబీ డాటా అందిస్తో్న్న అన్ని ప్లాన్లకు దాని పరిమితిని రోజుకి 1.5 జీబీకి పెంచింది. అలాగే రోజుకి 1.5జీబీ పరిమితి ఉన్న ప్లాన్లకు రోజుకి 2జీబీ అందించనుంది. అంటే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్లు ఇకపై రోజుకి 1.5 జీబీ డాటాను అందిస్తాయి. ఈ ప్లాన్ల కాలపరిమితులు వరసగా 28, 70, 84, 91 రోజులుగా నిర్ణయించారు.