వరంగల్‌కు టెక్‌ మహేంద్ర…

244
Tech Mahindra for Warangal
- Advertisement -

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణలో పరిశ్రమల వృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని పలువురు దిగ్గజ కంపెనీల అధినేతలకు చెప్పారు. టెక్‌ మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రాను కలిశారు కేటీఆర్. తెలంగాణలో పరిశ్రమను స్థాపించాలని ఆయనను కోరారు. దీనిపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా వరంగల్‌లో టెక్‌ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఆయన తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేసి కృతజ్ఞతలు తెలిపారు.

Tech Mahindra for Warangal

ఫిలిప్స్ మార్కెటింగ్ చీఫ్ హెంక్ డీ జాంగ్ కాసేపు మంత్రితో ముచ్చ‌టించారు. మెడిక‌ల్ డివైస్‌లు, ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల ఉత్ప‌త్తి కోసం తెలంగాణలో ఉన్న లాభ‌దాయ‌క‌మైన ప‌రిస్థితుల కోసం మంత్రి కేటీఆర్‌.. ఫిలిప్స్ సంస్థ‌కు వివ‌రించారు. ట్రినా సోలార్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రోంగ్‌ఫాంగ్‌తోనూ భేటీ అయ్యారు. సౌర విద్యుత్తు కోసం ఫ‌ల‌కాలు త‌యారు చేసే అతి పెద్ద సంస్థ‌గా రోంగ్‌ఫాంగ్‌కు గుర్తింపు ఉన్న‌ది. తెలంగాణ‌లో ఇప్పుడు క్లీన్ ఎన‌ర్జీ యుగం న‌డుస్తున్న‌ద‌ని, సోలార్ ప్యానెళ్ల ఉత్ప‌త్తి కోసం తెలంగాణ‌ అనువైన ప్ర‌దేశ‌మ‌ని మంత్రి కేటీఆర్ ట్రినా సోలార్ సంస్థ‌కు తెలియ‌జేశారు.

వెల్‌స్ప‌న్ గ్రూపు సంస్థ చైర్మ‌న్ బీకే గోయెంక‌తోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. బల్గేరియాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి నికోలినా అంగ్లికోవాతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టూరిజం అంశంపై ముచ్చటించారు. పర్యాటకంలోనూ ఇద్దరి మధ్య పరస్పర సహకారం ఉండాలని నేతలు నిర్ణయించారు.

- Advertisement -