చంద్రబాబుతో కేటీఆర్ భేటీ..

255
Ktr Meets Chandrababu
- Advertisement -

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బిజిబిజిగా ఉన్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన కేటీఆర్ ఇవాళ్టి నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు ప్రపంచదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు చేరుకున్నారు. ప్రధాని మోడీ,ఏపీ సీఎం చంద్రబాబు,లోకేష్‌తో పాటు పలువురు ప్రముఖులు దావోస్‌లో ఉన్నారు.

Ktr meets Chandrababu

ఈ సందర్భంగా  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిశారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ కు కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్, లోకేష్ సమావేశంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు.

తన దావోస్ పర్యటనకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. తాజాగా దావోస్‌లో మంచు కొండల అందాలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. దావోస్ అందాలు నిజంగా అబ్బురపరుస్తున్నాయంటూ ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు.

- Advertisement -