త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య సోషల్ మీడియా వేదికగా బీఫ్ వార్ నడుస్తోంది. బీఫ్‌కు సంబంధించి బీజేపీ విడుదల చేసిన వీడియోకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. బీజేపీ(బీఫ్ జనతా పార్టీ)అంటూ కొత్త అర్ధం చెప్పింది కాంగ్రెస్. ఇందులో బీఫ్‌కు మద్దతు తెలుపుతు బీజేపీ నేతలు గోవా సీఎం మనోహర్ పారికర్,కేరళ,యూపీ నేతలు చేసిన వ్యాఖ్యలను చేరుస్తూ వీడియోని రూపొందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Parrikar wants to import it, Yogi wants to export it, Rijiju wants to eat it, Som wants to sell it.
Do not mix Beef and Business. Mixing Beef and Politics, a definite YES!
Enough of your hypocrisy @BJP4India pic.twitter.com/f6DMDzreOi
— Karnataka Congress (@INCKarnataka) January 21, 2018
అంతకముందు గుండు రావు మిలటరీ హోటల్ పేరుతో సీఎం సిద్దరామయ్య బీఫ్‌ను వండుతున్నట్లు చూపించడమే కాదు దానికి సిద్దు బీఫ్ బిర్యానీ అని పేరు పెట్టింది. దీంతో ఒక్కసారిగా కర్ణాటక రాజకీయాలు బీఫ్ చుట్టుచేరాయి.
Siddaramaiah led Congress govt has been the most anti-Hindu Govt in the history of K'taka. CM himself has repeatedly boasted of his anti-Hindu image. But of late, he has been trying hard to prove his Hindu credentials. But it is too late Mr. CM . Start packing your bags! pic.twitter.com/vdT9BTfVcL
— BJP Karnataka (@BJP4Karnataka) January 18, 2018
గతంలో బీజేపీ, ఆరెస్సెస్ ఉగ్రవాద సంస్థలంటూ సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేయగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మైసూర్ ఉత్సవాలను హిందుత్వతో మూడిపెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా బీఫ్ చుట్టు రాజకీయాలు చేరడం….బీఫ్ ఎగుమతిలో యూపీ ముందంజలో ఉండటం వంటి అంశాలను సిద్దరామయ్య ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.