విదేశీ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ జ్యూరిచ్ నగరంలో మంత్రి కేటీఆర్ కు ప్రవాస తెలంగాణవాసులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అమలును మంత్రి కేటీఆర్ ఎన్ఆర్ఐలకు వివరించారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. ఆనాడు ఉద్యమంలో..నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమన్నారు. తెలంగాణకు ఎన్నారైలే బ్రాండ్ అంబాసిడర్లు అని స్పష్టంచేశారు. ఉద్యమ లక్ష్యాల సాధన దిశగా ప్రయాణం మొదలైందని…. కేసీఆర్ విజన్‌కు పలు రాష్ర్టాలు, కేంద్రం అభినందనలు తెలిపాయన్నారు. ఈ కార్యక్రమంలో స్వీడన్, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్ నుంచి తెలుగు ప్రజలు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఈ నెల 26 వరకు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగనున్న విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ రాష్ట్రం తరపున ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. స్థానిక ప్రభుత్వం మంత్రి కేటీఆర్ రక్షణకు ఇద్దరు స్విస్ పోలీసులను ఏర్పాటు చేసింది. దీనిపై మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక ప్రభుత్వానికి, ఇండియన్ ఎంబసీకి కృతజ్ఞతలు తెలిపారు.
Minister @KTRTRS, who is leading a delegation to @wef Davos, addressed a Meet & Greet organized by diaspora organizations at Zurich. During his address, Minister thanked the diaspora members for taking active interest in development of their motherland. pic.twitter.com/RsRCnPjLFS
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 22, 2018