పూరీ-ఛార్మి పబ్ లో రచ్చరచ్చ…

735
puri jagannath, charmi
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీ లో డ్యాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు పూరీ జగన్నాద్ అసలు ఇండస్ట్రీ లో ఇంతకుముందు పూరీ సినిమాలకు ఉంటె ఆ కిక్కే వేరు..అయితే గత కొన్నాళ్ళ నుండి పూరీ కి కలిసిరావడం లేదు సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ దానికితోడు మొన్న ఈమధ్య డ్రగ్స్ కేసులో ముందజలో ఉన్నాడు. అటు పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మికౌర్‌ ఒక‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించి అల‌రించింది. కొంత కాలంగా న‌టన‌కు దూరంగా ఉంటూ పూరీ సినిమాల‌కి సంబంధించి ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌లు చూసుకుంటుంది.

puri jagannath, charmi

అయితే ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ త‌న కొడుకు ఆకాశ్ హీరోగా మెహ‌బూబా అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా ఇండియాలోని ప‌లు ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు తన ట్విట్ట‌ర్ ద్వారా అందిస్తూనే ఉంటుంది ఛార్మి. తాజాగా ఈ చిత్ర బృందమంతా కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో ఒకటి ఆన్ లైన్లోకి వచ్చింది.

పూరి జగన్నాథ్.. ఆయన సన్నిహితురాలు.. ‘మెహబూబా’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఛార్మి.. ఆకాష్.. హీరోయిన్ నేహా శెట్టి.. మిగతా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఈ పార్టీలో పాల్గొన్నారు. హిందీ పాటలకు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేశారు. ఛార్మి తనదైన శైలిలో డ్యాన్స్ చేయగా.. పూరి సైతం అందరితో పాదం కలిపాడు. పూరి కొడుకే కొంచెం బిడియంతో కనిపించాడు. ప్రస్తుతం ఈ  వీడియో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -