అనుష్క సినీ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు.ఈ అమ్మడు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ.. తన కెరీర్ను అంతకంతకూ పెంచుకుపోతున్న ఆమె.. తాజాగా భాగమతితో మరోసారి ప్రేక్షకుల్ని పలుకరించనుంది. అందాల ఆరబోతకే హీరోయిన్లు అనే మాట అనుష్కకు మినహాయింపు. పబ్లిక్ ఫంక్షన్లకు అటెండ్ అయ్యేటప్పుడు ఎలాంటి మేకప్ లేకుండా సాదాసీదాగా.. నిండుగా వచ్చే హీరోయిన్లలో అనుష్క ముందుంటారు.
అనుష్కకు ప్రభాస్ కు లవ్ అఫైర్ ఉందని వారు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు చెక్కర్లు కోడుతున్న విషయం తెలిసిందే. మరి ఇదే విషయాన్ని సూటిగా ఆమెనే అడిగేస్తే..? తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో ఉన్న రిలేషన్ ఏంటి? పెళ్లిపైనా అనుష్క రియాక్ట్ అయ్యింది. ఎప్పటి నుంచో ట్రావెల్ చేయటం.. ఇద్దరూ పెళ్లి కాని వాళ్లం కావటంతో ఏదేదో అనుకుంటారని.. అది సహజమని తేలిగ్గా తేల్చేసింది. అయితే.. తాను చెప్పిన విషయాల్ని వేరేగా ప్రొజెక్ట్ చేస్తే మాత్రం బాధగా ఉంటుందంది. ప్రభాస్ చాలామంచి వ్యక్తి అని.. స్నేహానికి చాలా గౌరవం ఇస్తాడని.. ఇద్దరం ఒకరికొకరం సంతోషంగా ఉంటామని చెప్పింది.
నీ పెళ్లి ఎప్పుడంటే.. నీ పెళ్లి ఎప్పుడని ఒకరికొకరు అడుగుతుంటారా? అంటే.. ఆ టాపిక్కే రాదని తేల్చేసింది అనుష్క. కోరుకున్న వాళ్లను పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఎవరు చెప్పకున్నా పెళ్లి చేసేసుకుంటామని.. పెళ్లన్నది వ్యక్తిగత విషయంగా పేర్కొంది.
ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది వారి.. వారి వ్యక్తిగత ఛాయిస్ అని.. ఎందుకంటే పెళ్లి ఫంక్షన్ అయ్యాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారని.. ఆ తర్వాత కలిసి ఉండాల్సింది భార్య భర్తలేనని చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అమ్మ.. నాన్నల నుంచి ఒత్తిడి ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. పెళ్లి చేయాలని అమ్మానాన్నలకు ఉంటుంది కానీ.. గట్టిగా అడగరని.. ప్రతి దానికి టైం ఉంటుందని.. అది రావాలని చెప్పింది.
సరైన వ్యక్తిని కలిసి.. జీవితాంతం అతనితో కలిసి గడపాలనిపిస్తే పెళ్లి అయిపోతుందని చెప్పింది. ఇంతకీ పెళ్లి వేడుక ఎలా ఉండాలని కోరుకుంటారని అడిగితే.. చాలా సింఫుల్ వెడ్డింగ్ అని చెబుతూ.. గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటే మేకప్ చేసుకోవాలిగా అంటూ నవ్వేసింది. మొత్తానికి పెళ్లి మ్యాటర్ గురించి స్వీటీ చాలానే మాట్లాడింది కదూ?