చిరుని చూసి ఆశ్చర్యపోయా…

206
Ktr Second day Japan tour
- Advertisement -

రాష్ట్రానికి పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా మంత్రి కేటీఆర్ జ‌పాన్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక వేత్త‌ల‌తో వ‌రుస భేటీల‌తో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే.. షిజ్వోకా ప్రాంతంలోని హమామట్సు అనే చిన్న టౌన్ కి వెళ్లారు. అక్కడ సుజుకి మ్యూజియంను సంద‌ర్శించారు. ఆ మ్యూజియంలో మెగాస్టార్ చిరంజీవి ఫొటో ఉంది. దీంతో కేటీఆర్ ఆశ్చర్యపోయారు.

సుజుకి మ్యూజియంను సందర్శించాను. ఇక్కడ ఎవరి ఫొటో చూశానో ఊహించగలరా? మన మెగాస్టార్ చిరంజీవిది. మన మాతృభూమికి చెందిన వారి ఫొటోను హమామట్సు లాంటి చిన్న పట్టణంలో చూడటం గర్వంగా అనిపించింది అని ట్విట్ చేశారు.

హైదరాబాద్ ఎప్పటికీ దేశానికి రెండో రాజధానిగానే కొనసాగుతుందన్నారు మంత్రి కేటీఆర్. జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేటీఆర్ ప్రముఖ అనలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ హైదరాబాద్ పై చేసిన ట్వీట్‌కు రీ ట్విట్ చేశారు. దేశంలో ఢిల్లీ తర్వాత రాష్ట్రపతి నిలయం ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. శీతాకాల విడిది నిమిత్తం ప్రతి ఏటా భారత రాష్ట్రపతి ఈ మహానగరానికి విచ్చేస్తుంటారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ హైదరాబాద్ దేశానికి ఎప్పుడూ రెండో రాజధానిగా కొనసాగుతుందని ట్వీట్ ద్వారా సమాధానం చెప్పారు.

- Advertisement -