ఇప్పటికే తెలుగు లో యాంకర్ గా ఓ పక్క రాణిస్తూనే , మరో పక్క వెండి తెర ఫై హీరోయిన్ గా , చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ రోల్స్ లలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది శ్రీముఖి. బుల్లితెర ఫై సక్సెస్ అయినా ఈ అమ్మడు , వెండితెర ఫై మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక పోతుంది. అప్పుడెప్పుడో ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కానీ సరైన బ్రేక్ మాత్రం ఇంతవరకు రాలేదు. ఆ బ్రేక్ కోసం బాగానే కష్టపడుతుంది కానీ రావడం లేదు.
అయితే ఈ అమ్మడు అల్లు అర్జున్ జులాయి సినిమాలో అల్లు అర్జున్ కు చెల్లిలిగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ అల్లు అర్జున్ ను కలిసిందట. తాను చాలా రోజుల తర్వాత మా జులాయి అన్నను కలిసానని అతనితో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇలా ఓ స్టార్ హీరోను అన్నయ్యగా చెప్పడం అంటే చాలానే ధైర్యం చేసేసినట్లే అని చెప్పాలి.
ఆన్ స్క్రీన్ లో సోదరుడిగా నటించినా.. ఆఫ్ స్క్రీన్ లో ఆ రిలేషన్ చెబితే.. ఇక ఎప్పటికీ ఆమెకు జోడీగా కాకపోయినా కనీసం మరదలిగా కూడా నటించే ఆఫర్ రాకపోవచ్చనే భయాలుంటాయి. కానీ శ్రీముఖి మాత్రం ఈ విషయంలో ఎలాంటి సంశయాలు పెట్టుకోకుండా బోలెడంత ధైర్యం చేసేసి.. స్టైలిష్ స్టార్ ను అన్నయ్యను చేసేసింది.