‘బిగ్ బాస్’ విజేతగా శిల్పా..

247
Bigg Boss 11 winner is Shilpa Shinde
- Advertisement -

అభిమానుల ఓట్ల మద్ధతులో టీవీ రియాల్టీ షో ‘బిగ్ బాస్ 11’ విజేతగా శిల్పాషిండే నిలిచారు. మూడు నెలలకుపైగా అలరించిన హిందీ బిగ్‌బాస్ షో ఆదివారం ముగిసింది. టీవీ నటి అయిన శిల్ప ట్రోఫీతోపాటు రూ. 44 లక్షల నగదును సొంతం చేసుకుంది. హౌస్‌లోకి అడుగుపెట్టింది మొదలు శిల్ప ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది. తొలి వారాల్లో వికాస్ గుప్తాతో ఆమె పోట్లాటకు దిగడం గురించి చర్చలు సాగాయి. ఆకాశ్ దడ్లానీ, ఆర్షి ఖాన్, పునీష్ గుప్తాలతో ఆమెకు చక్కటి అనుబంధం ఏర్పడింది. స్టార్ ప్లస్ ఛానెల్లో ప్రసారమైన ‘భాభి’లో నెగెటివ్ రోల్‌లో కనిపించడం ద్వారా శిల్పా గుర్తింపు పొందారు.

Bigg Boss 11 winner is Shilpa Shinde

టాస్క్‌లు పూర్తి చేయడంలో శ్రద్ధపెట్టకపోవడం, ఎప్పుడూ కిచెన్‌లోనే ఉండటంతో శిల్ప తీరును హౌస్‌మేట్స్ విమర్శించారు. గత ఏడాదిగా దాదాపు ఖాళీగా ఉంటున్న శిల్పా షిండే బిగ్‌బాస్ టైటిల్ నెగ్గడంతో.. ఆమెకు అవకాశాలు వెల్లువెత్తే వీలుంది. ఇతర హౌస్‌మేట్స్ పట్ల శిల్ప కేరింగ్‌గా ఉండటం ప్రేక్షకులకు నచ్చింది. దీంతో ఆమెకే ఎప్పుడూ భారీగా ఓట్లేశారు. శిల్పాషిండే ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ సౌత్ సినీ ఇండస్ట్రీపై నోరు పారేసుకుంది. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ ఆ సౌత్ ఇండస్ట్రీ ఉంది చూడండీ.. అంతా కన్నింగ్, దొంగలు అని తిట్టింది.

శిల్పా షిండే విజేతగా నిలిచిన ఈ బిగ్ బాస్ పర్వంలో హీనాఖాన్, హితేన్ తేజ్ వాణి, వికాస్ గుప్తా, ప్రియాంకశర్మ, పునీత్ శర్మ, ఆర్షిఖాన్, ఆకాష్ దద్లానీ, బేనఫ్షా సూనావాలా, లువ్ సిన్హా, బందగీ కల్రా, సవ్యసాచి సత్పతి, మేహజబీ సిద్ధిఖీ, సప్నాచౌదరి, జుబేర్ ఖాన్, శివానీ దుర్గా, జ్యోతికుమారి, లుసిండా నికోలస్, చిందక్ పూజాలు పాల్గొని టీవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.

- Advertisement -