సాహో సెట్‌లో భాగమతి

256
Baghamathi Anushka Visits Prabhas Sahoo Sets
- Advertisement -

బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీ సాహో . సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 200 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీకి బాలీవుడ్, హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషయన్లు పనిచేస్తున్నారు.

ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అబుదాబిలో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్ లు పాల్గొంటున్న ఈ యాక్షన్ సీన్స్ ను మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సాహో సెట్‌లో భాగమతి అనుష్క సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్, మురళీ శర్మతో కలిసి సెల్ఫీ తీసుకుంది. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సాహో’ సెట్‌లో అనుష్కకు పనేంటని కొందరు అంటుంటే.. ఆమె అతిథి పాత్రలో కనిపించబోతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం అనుష్క భాగమతిగా ప్రేక్షకుల ముందుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె విడుదలైన భాగమతి ట్రైలర్లు, పోస్టర్లపై ప్రభాస్ ప్రశంసలు గుప్పించగా తాజాగా అనుస్క సాహో సెట్‌లో సందడి చేసింది. ఇదిఇలా ఉండగా ‘సాహో’లో మొదట అనుష్క శెట్టి పేరునే పరిశీలించారు. ఆ తర్వాత శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేశారు.

- Advertisement -