స్కిన్ ‘షో’కి నిత్యా మీనన్ ఆమడ దూరం. అదొక్కటే కాదు.. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తుంది. కానీ.. పాత్రకు ప్రాధాన్యత ఉంటే అందుకోసం ఎలాంటి సన్నివేశాలలోనైనా నటించేందుకు వెనకాడదు మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ .
ఈ నేపథ్యంలో తాజాగా ఒక వైవిధ్య పాత్రకు నిత్యామీనన్ ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే లెస్బియన్(స్వలింగ సంసర్కురాలు) పాత్రలో నిత్యామీనన్ కనిపించనుందట. తెలుగులో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో మరో నాయికతో రొమాన్స్ చేయనుందట నిత్యామీనన్. అంతేకాదు పాత్ర డిమాండ్ మేరకు ఆ హీరోయిన్‌తో నిత్యా మీనన్ లిప్ లాక్ కూడా చేసిందట.
అయితే నిత్య ఏ హీరోయిన్ తో లిప్ లాక్ చేసిందన్న సంగతి పక్కనపెడితే.. అసలు ఆమె లెస్బియన్(స్వలింగ సంపర్కురాలు) పాత్రలో నటించబోతున్నారన్న దానిపై క్లారిటీ మాత్రం లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నిత్యామీనన్ ‘అ!’ సినిమాతో పాటు మరో భారీ బడ్జెట్ చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.