అనుష్క ఏంటి ఇలా..

231
Holi With Pari
- Advertisement -

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో వివాహమయ్యాక అనుష్క సినిమాల నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. ఇటీవలె తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో ఆమె నిర్మాతగా నటిస్తున్న చిత్రం పరి.  ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

టీజర్‌లో బాధగా చూస్తున్న అనుష్క ముఖం ఒక్కసారిగా అంతా రక్తపుమరకలతో భయంకరంగా మారడం సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఇలాంటి పాత్రలో అనుష్క నటించడం ఇదే తొలిసారి. అనుష్క టీజర్‌ను పోస్ట్‌ చేస్తూ ‘స్వీట్‌ డ్రీమ్స్‌ గాయ్స్‌’ అని ట్వీట్‌ చేసింది.

మార్చి 2న సినిమా విడుద‌ల కానుండ‌గా అనుష్క ఆహార్యాన్ని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.  ప‌రంబ్ర‌త చ‌ట‌ర్జీ, రాజ్ క‌పూర్‌, రితాబ‌రీ చ‌క్ర‌వ‌ర్తి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -