పవర్ స్టార్ పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. మరికాసేపట్లో ప్రీమియర్ షోల రూపంలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా అజ్ఞాతవాసి సినిమాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమాలో ‘కొడకా కోటేశ్వరరావు ఖరుసైపోతవురో..’ అంటూ పవన్ కల్యాణ్ పాడిన పాట తమ మనోభావాలను దెబ్బతీసిందని విజయవాడకు చెందిన న్యాయవాది కోటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కోటేశ్వరరావు పేరును పవన్ కల్యాణ్ నీచంగా, అవహేశన చేస్తూ పాట పాడారని ఆరోపించారు.కోటేశ్వరరావు పేరు ఉన్న ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా చేశారు.. నేను ఎంతో మానసిక క్షోభను అనుభవించానని తెలిపారు.
పవన్ కల్యాణ్ పంచె కట్టుకుంటే లేక వెరైటీ ఫ్యాంటు వేస్తేనే అందరూ అది ఫాలో అవుతుంటారు. కోటేశ్వరరావు అనే పేరుకి బదులుగా కొడకా చిరంజీవి అని, కొడకా నాగబాబు అని పెట్టుకోండి.. మా పేరును ఇలా అవహేళన చేస్తోంటే మేము ఆత్మహత్య చేసుకోవాలా?” అని ప్రశ్నించారు.