తమిళ స్టార్ సూర్య నటించిన గ్యాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సూర్య 2018లో అందరి కలలు సాకారం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సంక్రాంతికి గ్యాంగ్‌తో వస్తున్నాని అందరిని కచ్చితంగా అలరిస్తుందన్నారు. తన సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి రాబోతుందని…ఆ సినిమాను కూడా చూడండని సూర్య తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ‘గ్యాంగ్’ అనేది చాలా ముఖ్యమైంది. మన అందరికీ స్కూల్, కాలేజ్, పనిచేసే చోట గ్యాంగ్ కచ్చితంగా ఉంటుంది. అది మన జీవితంలో చాలా ముఖ్యం. ఈ సినిమాకు ‘గ్యాంగ్’ అని పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ‘గ్యాంగ్’ రావడానికి ప్రధాన కారణం నిర్మాత అల్లు అరవింద్ అని ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ మర్చిపోలేన్నారు.
మొదటి సారి తను డబ్బింగ్ చెప్పాను అని తెలుగులో ఒక డైలాగ్ కూడా చెప్పాడు. గుండెల్లో దైర్యం చేతిలో ధర్మం ఉంటే దేనికి బయపడక్కర్లేదు అని సూర్యా చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. సూర్య సరసన మహానటి ఫేం కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.