టాలీవుడ్లో ప్రయోగాలకు మారుపేరు దర్శకుడు తేజ. కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్న తక్కువ టైంలో సినిమా తీయాలన్న తేజ స్టైలే వేరు. కెరీర్ ప్రారంభంలో యూత్ ఎంటర్టైన్ సినిమాలతో ఆకట్టుకున్న తేజ చాలాకాలం తర్వాత నేనే రాజు నేనే మంత్రితో మళ్లీ సక్సెస్ బాటపట్టాడు.
దీంతో తేజకు అవకాశాలు వెతుక్కుంటు వస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకోసం తేజ తీవ్ర కసరత్తు చేస్తున్నాడట. ముఖ్యంగా పాత్రల ఎంపిక తేజకు కష్టంగా మారిందట.
అయితే సినిమాలో వీలైనంత తక్కువ పాత్రలతోనే కథ చెప్పాలని, పాత్రల ఎంపిక కోసం కూడా ఎక్కువగా ఆలోచించవద్దని తేజకు సూచించారట బాలయ్య. ఈ నేపథ్యంలో సినిమాలో బసవతారకం పాత్రకు సూటయ్యే ఆర్టిస్ట్ కోసం తేజ ‘ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ’ని ఉపయోగించుకుంటున్నారట. బసవతారకం గారి పోలికలకు దగ్గరగా ఉండే నటీమణులని ఎంచుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఆడిషన్స్ కోసం వచ్చిన వారి ఫోటోల్ని సాఫ్ట్ వేర్ లో అప్ డేట్ చేస్తే …ఆ సాఫ్ట్ వేరే బసవతారకం పోలిన పోటోల్ని సెలక్ట్ చేస్తుంది. అలా సెలక్ట్ చేసిన ఫోటోల ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 18న సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టీజర్ కోసం నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.