విభిన్నమైన కథలతో.. విలక్షణమైన పాత్రలతో భాష, ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన మెగాస్టార్ మమ్ముట్టి. 2018లో కేరళ పొలిటీషియన్ జి. కార్తీ కేయన్ కథ ఆధారంగా బాలచంద్ర మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘నాయాం వ్యక్తమక్కున్ను’తో పాటు స్ట్రీట్ లైట్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.
స్ట్రీట్ లైట్స్ సినిమాతో సినిమాటోగ్రఫర్ శందాత్ దర్శకుడిగా పరిచయమవుతుండగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా టీజర్‌తో ముందుకు వచ్చిన చిత్రయూనిట్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. జేమ్స్‌గా పోలీస్ పాత్రలో మమ్ముట్టి అలచించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు,మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇక ఈ సినిమాతో పాటు నాయాం వ్యక్తమక్కున్నులో మమ్ముట్టి ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. దీంతో పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో కూడా మమ్ముట్టి నటించనున్నట్లు సమాచారం. మొత్తంగా 2018లో వరుస సినిమాలతో మమ్ముట్టి ఫ్యాన్స్‌ను మరింతగా అలరించనున్నాడు.