‘అమీర్‌పేట్ టు అమెరికా’ పోస్టర్ లాంచ్..

279
First poster of "Ameerpet to America" Movie Released
- Advertisement -

రాధా మీడియా బ్యానర్ పై శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పించు ఎ టు ఎ, ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ని నగర ప్రథమ పౌరుడు ,హైదరాబాద్ మేయర్ బొంతు రామ్‌మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసివుద్దీన్ కలిసి శుక్రవారం రిలీజ్ చేశారు. చిత్రానికి కర్త, కర్మ, క్రియ గా వున్న రామ్ మోహన్ కొమండూరి ‘‘ఏ టు ఏ’’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని వినూత్నంగా డిజైన్ చేశారు. తెలంగాణాకి రారాజు సి.ఎం. కెసిఆర్ ఐతే అమెరికా కి రారాజు డోనాల్డ్ ట్రంప్. ఇటు తెలంగాణా నుండి అమెరికా కి ఎగురుతున్న విమానం తో కాన్సెప్ట్ ని సూటిగా చెప్తున్న కొత్త తరహా పోస్టర్ అని పలువురు ప్రశంసించారు.

First poster of "Ameerpet to America" Movie Released

బ్రహ్మానందం,మణిచందన, సమ్మెట గాంధీ, రజని, వేణుగోపాల్, వేణుమాధవ్, వారిజ, తేజస్, పల్లవి దొర, వంశీ కోడూరి, మేఘనా లోకేష్, వంశీ కృష్ణ, సాషా సింగ్, వైవా హర్ష,ప్రధానపాత్ర లుగా, అమెరికా నుండి కొందరు, ఇండియా నుండి కొందరు నటించిన చిత్రం ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’. ఇటీవలనే చిత్రంలోని పాటను ఫ్లాష్ మాబ్ ద్వారా వినూత్నంగా విడుదల చేసారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి దర్శకుడు- చల్లా భానుకిరణ్. కెమెరా-అరుణ్, జిఎల్ బాబు. ఎడిటర్ -ప్రవీణ్ పూడి, సంగీతం- కార్తీక్ కొడకండ్ల.

- Advertisement -